సల్మాన్ ఖాన్ రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే.. 

05 March 2025

Prudvi Battula 

బాజీగర్ మూవీలో ప్రధాన పాత్ర కోసం సల్మాన్ ఖాన్‎ని సంప్రదించారు. కానీ అతనికి ఆ యాంటీ హీరో పాత్ర నచ్చలేదు.

తన తండ్రి రచయిత సలీం ఖాన్‎తో చర్చించిన తర్వాత అతను ఆ సినిమాని తిరస్కరించాడని తెలుస్తోంది. తర్వాత ఇది షారుఖ్ ఖాన్ చేసారు.

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేలో షారూఖ్‌ఖాన్‌కు ముందు ఆదిత్య చోప్రా ఈ ఐకానిక్ చిత్రాన్ని సల్మాన్‌కు ఆఫర్ చేశాడు. కానీ అతను దానిని తిరస్కరించాడు.

షారుఖ్‎కి ముందు, జోష్ కోసం సల్మాన్‎ని సంప్రదించారు. తెరపై ఐశ్వర్య రాయ్ సోదరుడిగా నటించడానికి ఇష్టపడలేదు.

కరణ్ జోహార్ కల్ హో నా హో రెండవ ప్రధాన పాత్ర కోసం సల్మాన్‌ను సంప్రదించగా అతను తిరస్కరించాడు. అతని స్థానంలో సైఫ్ అలీ ఖాన్ వచ్చారు.

సల్మాన్ కు ముందుగా మరో సినిమా ఆఫర్ వచ్చింది, కానీ అతను తిరస్కరించాడు, షారుఖ్ కు లాభం చేకూరింది. అదే చక్ దే ఇండియా!

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గజిని స్క్రిప్ట్ తో సల్మాన్ దగ్గరికి వెళ్ళాడు, కానీ అమీర్‎ని సంప్రదించమని ఆయన సలహా ఇచ్చాడు.

తలాష్ చిత్రానికి కండల వీరుడు సల్మాన్ ఖాన్ మొదటి ఎంపిక. కానీ అతను ఆ సస్పెన్స్-థ్రిల్లర్‌ను తిరస్కరించాడు.