Rajeev 

17 May 2024

హీరోయిన్ గా ఎప్పుడు కనిపిస్తావ్ అమ్మడు.. బిగ్ బాస్ బ్యూటీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

బిందుమాధవి.. ఈ తెలుగు అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఆతర్వాత సరైన గుర్తింపు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా మరి సినిమాలు చేసింది. అయినా సక్సెస్ కాలేదు. 

కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ చిన్నది సినిమాలు చేసింది. అక్కడ కూడా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు.

బిందు మాధవి 2022లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మొదటి సీజన్‌లో విజేతగా నిలిచింది. తన ఆటతో అందరిని ఆకట్టుకుంది.

బిగ్ బాస్ గేమ్ షో తర్వాత ఈ చిన్నది తిరిగి సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

పోనీ టీవీ షోలతోనైనా ఈ అమ్మడు కనిపిస్తుందేమో అని చూసిన ప్రేక్షకులకు కూడా నిరాశే ఎదురైంది.

ఇక వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటుంది బిందు మాధవి. న్యూసెన్స్, మాన్షన్ 24, యాంగర్ టేల్స్ సిరీస్ లలో నటించింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.