కన్నడ ముద్దుగుమ్మ తనుజా గౌడ బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 తో ప్రస్తుతం సోషల్ మీడియా ఫుల్ ట్రెండ్ అవుతుంది ఈ పేరు.
ఈ చిన్నది 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అయితే తనుజా గౌడ సీరియల్ లోకి అడుగు పుట్టకముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు.
తరువాత నెమ్మదిగా సీరియల్స్ లోకి అడుగు పెట్టింది. 'ముద్ద మందారం' సీరియల్‌లో పార్వతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత నాగ భైరవి సీరియల్‌లోనూ ఆమె నటించింది. ఆమె గ్లామర్‌తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది.
ఆమె గ్లామర్‌తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది. ఆ ఫాలోయింగ్ తోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 లో స్థానం సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే బిగ్‌బాస్‌లో కన్నడ అమ్మాయిలు బాగా రాణించారు. తనుజా గౌడ కూడా బాగా ఆడి ఫైనల్స్ లో కి అడుగుపెడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.