05 October 2024

ఫ్యాన్స్‏కు హమిదా షాక్.. బ్రహ్మముడి సీరియల్ నుంచి స్వప్న అవుట్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై కార్తీక దీపం, గుప్పెడంత మనసు సీరియల్స్ తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకుంటున్న సీరియల్ బ్రహ్మమూడి.

ఈ సీరియల్లో కనకం పెద్ద కూతురు స్వప్న ఒక స్వార్థపరురాలు. రుద్రాణి కొడుకు రాహుల్ మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకుంటుంది.

ఇందులో స్వప్న పాత్రలో ఒదిగిపోయింది హమీదా. తన నటనతో ప్రేక్షకులను నవ్వించింది.. మరికొన్నిసార్లు ఏడిపించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సీరియల్లో తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ హమీదా పేరుతో కాకుండా బ్రహ్మముడి స్వప్న పేరుతోనే మరింత దగ్గరయ్యింది.

అంతగా తన నటనతో కనకం పెద్ద కూతురిగా అడియన్స్ హృదయాలను దొచుకున్న హమీదా.. ఇప్పుడు తన అభిమానులకు షాకిచ్చింది. 

తాజాగా ఈ సీరియల్ నుంచి తప్పుకుంది హమీదా. నేటి కథనంలో హమీదా కనిపించలేదు. స్వప్న పాత్ర నుంచి హమీదా తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

నేటి ఎపిసోడ్ లో స్వప్న పాత్రలో మరో అమ్మాయిని చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో హమీదాకు కామెంట్స్ పెడుతున్నారు. 

అయితే హమీదా.. ఇంత మంచి పాత్రను వదులుకోవడానికి అసలు కారణం తెలియరాలేదు. బహుశా అంతకన్నా మంచి ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిందేమో.