12 July 2024

వారెవ్వా.. సుబ్బు అందం.. సెగలు పుట్టిస్తోన్న బిగ్‏బాస్ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శుభశ్రీ రాయగురు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. 

బిగ్‏బాస్ సీజన్ 7 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది శుభశ్రీ. ఈ రియాల్టీ షోలో వచ్చీరానీ తెలుగులో మాట్లాడి తెగ సందడి చేసింది. 

ఒడిశాకు చెందిన ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన రోల్ పడలేదు. 

బిగ్‏బాస్ సీజన్ 7లో ఉన్న లేడీ కంటెస్టెంట్లలో ఆటపరంగా అదరగొట్టింది శుభశ్రీ రాయగురు. టాస్కులలో అబ్బాయిలకే గట్టిపోటీ ఇచ్చింది. 

కానీ ఓటింగ్ తక్కువ రావడంతో హౌస్‏లో ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. కానీ బయటకు వచ్చాక ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వచ్చాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది శుభశ్రీ. అలాగే మరికొన్ని చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తున్నట్లు టాక్. 

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సుబ్బుకు ఇన్ స్టాలో 680K ఫాలోవర్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మోడ్రస్ డ్రెస్సులతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది ఈ బుల్లితెర బ్యూటీ.