17 July 2024
లవర్స్ అలా చేస్తే బ్రేకప్ గ్యారెంటీ అంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయ్యింది శ్రీసత్య. అంతకుముందు పలు సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు పోషించింది.
అలాగే పలు షోలలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఆఫర్స్ కోసం లిప్స్ కు సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది ఈ సీరియల్ బ్యూటీ. ప్రస్తుతం తాను అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
అలాగే లవ్, బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దయచేసి ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ పొంగిపోతుంటే .. గుండెల్లో దాచుకోండి కానీ టాటూలు వద్దంటుంది.
గుండెలపై లేదా ఇతర భాగాల్లో టాటూలు మాత్రం వేయించుకోవద్దని సలహా ఇస్తుంది. ఒకవేళ టాటూ వేయించుకుంటే బ్రేకప్ అవుతుందని అంటోంది.
లవర్స్ ఎవరూ టాటూలు వేయించుకోవద్దు.. టాటూ వేయించుకున్నారంటే ఖచ్చితంగా విడిపోతారు. అలా చాలామందిని చూశానంటూ చెప్పుకొచ్చింది.
టాటూ వేయించుకున్నారంటే బ్రేకప్ గ్యారెంటీ అని.. విడిపోయిన తర్వాత వాటిని కవర్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు చేయాలని తెలిపింది శ్రీసత్య.
తన లవర్ కూడా గుండెలపైనే టాటూ వేయించుకున్నాడని.. కానీ ఇప్పుడు తనది బ్రేకప్ అయిపోయిందని.. ప్రేమను గుండెల్లోనే దాచుకోవాలని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.