30 July 2024
నేను డబ్బు మనిషి అంటారు.. కానీ అమ్మకు నెలకు రూ.లక్ష.. శ్రీసత్య..
Rajitha Chanti
Pic credit - Instagram
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది శ్రీసత్య. అంతకుముందు పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీసత్య తన లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే తన లైఫ్లో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొచ్చింది.
అందరూ అనుకుంటున్నట్లు తాను డబ్బు మనిషిని కాదని అన్నారు. అమ్మ కోసం నెలకు దాదాపు రూ.లక్షకు ఆసుపత్రికి ఖర్చవుతుంది.
జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అంటారు. నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు అని చెప్పుకొచ్చింది శ్రీసత్య.
తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్ ఎవరు ఇవ్వరని.. కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంట్. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరని చెప్పుకొచ్చింది శ్రీసత్య.
తన తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని.. ఆమెకు నెలకు రూ.1 లక్షకు పైగా ఖర్చు అవుతుందని. కారు కొనడానికి డబ్బుల్లేవని తెలిపింది.
2019లో చిన్న కారు కొన్నానని.. అది కూడా పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చువుతుందని అమ్మేశానని.. తన వద్ద కారు కూడా లేదని..
తనకు వచ్చిన ఖర్చులన్నీ అమ్మ ఆసుపత్రికే ఖర్చులకే సరిపోతాయని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.