07 June 2024

అరియానా కల నెరవేరుతున్న వేళా.. సంతోషంలో బిగ్‏బాస్ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది యాంకర్ అరియానా. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై బాగానే సందడి చేస్తుంది. 

అయితే ఈ బ్యూటీకి కావాల్సినంత బ్రేక్, సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇప్పటికీ సినిమాల్లో అరియానా సరైన ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోతుంది.

ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో సైడ్ రోల్ పోషించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. బుల్లితెరపై ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా ఉంటుంది.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. 

తాజాగా తన చెల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నామని సంతోషంగా వ్యక్తం చేసింది అరియానా. 

డ్రీమ్ హౌస్ రెడీ కాబోతుందని చెబుతూ.. తమ కొత్తి ఇంటి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం అరియానా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ స్పందిస్తూ అరియానాకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‏బాస్ లాస్య మంజునాథ్, ప్రియాంక సింగ్, బుల్లితెర నటి అన్షు, నటి రాజేశ్వరి, హమీదా, యాంకర్ శివ కంగ్రాట్స్ చెప్పగా.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది.