బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌ను చెడుగుడు ఆడిన యూట్యూబర్ అన్వేష్..

11 September 2023

బిగ్ బాస్ షోలోకి రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో కామన్ మ్యాన్ విభాగంలో ఎంటరయిన ప్రశాంత్ తాను అనుకున్నది సాధించాడు

అయితే లోపలికి వెళ్లాక మనోడు బిహేవియర్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత్ రతికతో పులిహోర కలపడంతో బోలెడన్ని మీమ్స్ సైతం సర్కులేట్ అవుతున్నాయి.

రైతులకు సంబంధించిన కష్టాలను అందరికీ తెలియజేస్తా అని వెళ్లి.. అక్కడ లవ్ ట్రాకులు నడపడంతో.. అతడిని ఆడేసుకుంటున్నారు జనాలు.

తాజాగా ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ ఓనర్ అన్వేష్ పల్లవి ప్రశాంత్‌ గురించి సంచలన కామెంట్స్ చేశాడు.

ప్రశాంత్ మాట్లాడే మాటలన్నీ డ్రామాలే అంటూ అతడి గురించి తేల్చేశాడు. వాడిని చూస్తేనే ఎంత పెద్ద మోసగాడో అర్థమవుతుందన్నాడు.

బిగ్ బాస్ షోలోకి వెళ్లి పాపులర్ అవ్వాలి..తనకు సపోర్ట్ చేయమని ప్రశాంత్ అన్వేష్‌ను అడిగాడట బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌.

ఈ షో కి వెళ్లడం వల్ల ఏమవుతుంది అని అడిగితే తాన అన్నదాతల గురించి అందరికీ తెలిసేలా చేస్తాను అని ప్రశాంత్ ఆన్సర్ ఇచ్చాడట.

తాజాగా వారం పూర్తి చేసుకున్న బిజీగా బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తున్నారు.