08 September 2025
ఎవర్రా ఈ అమ్మాయి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంత క్యూట్‌గా ఉంది.. ఫోటోస్
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 9 సందడి మొదలైంది. ఈసారి ఫన్ కాదు రణరంగమే అంటూ ముందే హైప్ పెంచేశారు హోస్ట్ నాగార్జున.
అయితే ఈసారి ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కామన్ గర్ల్ ప్రియ శెట్టి అలియాస్ ప్రియ ఈపోరు ఒకరు.
బిగ్‌బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి గట్టిగా వినిపించిన పేరు ఇదే. అగ్నిపరీక్షలో గెలిచి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.
హౌస్‌లో సింపుల్ లుక్స్ లో మరింత క్యూట్ గా కనిపిస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు.
రాయలసీమలోని కర్నూలుకు చెందిన ప్రియశెట్టి.. మెడిసిన్ చదివి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే తల్లిదండ్రుల సపోర్టుతో బిగ్ బాస్ షోకు వచ్చిందట.
ప్రస్తుతం తన తండ్రి తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడతానని తెలిపింది ప్రియ.
అలాగే తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియ శెట్టి క్రేజీ ఫోటోస్ ఇన్ స్టాలో తెగ వైరలవుతున్నాయి.
అగ్నిపరీక్ష సమయంలో తన ఆట తీరు, మాట తీరుతో ఆకట్టుకున్న ప్రియ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్