06 October 2024

కాలేజీ లవ్ స్టోరీ రివీల్ చేసిన యష్మీ.. పచ్చబొట్టుతో మోసం.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బిగ్‏బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈసారి హౌస్‏లో సీరియల్ నటీనటులే ఎంట్రీ ఇచ్చారు. అందులో యష్మీ గౌడ ఒకరు. 

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. 

ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలో అబ్బాయిలతో పోటీ పడి మరి టాస్కులతో అదరగొట్టేస్తుంది. ఈ బ్యూటీకి కాస్త నెగిటివిటీ కూడా ఉంది. 

 ఇదిలా ఉంటే తాజాగా శనివారం జరిగిన ఎపిసోడ్‏లో తన కాలేజీ లవ్ స్టోరీ రివీల్ చేసింది. నాగ్ అడగడంతో అసలు విషయం చెప్పేసింది. 

కాలేజీలో ఒకరిని ప్రేమించానని.. అతడి పేరు.. తన పేర్లతో మొదటి అక్షరాలను పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని చెప్పుకొచ్చింది. 

కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపింది. 

అయితే ఆది చైనీస్ భాష కాదు జాపనీస్ భాష అని తెలిసిందని.. అంతేకాకుండా ఆ అక్షరాలకు అసలు అర్థమే లేదని తెలిసిందని చెప్పుకొచ్చింది.

దీంతో తాను మోసపోయానని గ్రహించానని తెలిపింది. అయితే ఆ అబ్బాయితో తనకు బ్రేకప్ అయ్యిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.