20 September 2024

అదరగొట్టేస్తున్న యష్మీ.. టాస్కులో శివంగిలా.. టాప్ 5 పక్కా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం బిగ్‏బాస్ హౌస్‏లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ యష్మీ గౌడ. ఇప్పుడు హౌస్‏లో శివంగిలా టాస్కులలో అదరగొట్టేస్తుంది. 

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో తెలుగువారిని మెప్పించింది.

కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన యష్మీ.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ ఫొటోజెనిక్ టైటిల్ గెలుచుకుంది యష్మీ. 

అలాగే మిస్ మైసూర్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ చేసిన యష్మీ.. స్వాతి చినుకులు సీరియల్ చేసింది. 

 కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్మీ.. ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్‏లో శివంగిలా ఆడుతుంది. 

మొదటి వారమే ఊహించని విధంగా చీఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత్ రెండు వారాలు ఆమెపై విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. 

ఇప్పుడు చీఫ్ స్థానం నుంచి తప్పుకున్న యష్మీ.. టాస్కులలో మాత్రం రెచ్చిపోయి ఆడేస్తుంది. ఆడమగా అనే తేడా లేకుండా అదరగొట్టేస్తుంది. 

ముఖ్యంగా గత రెండు రోజులుగా ఎగ్స్ సంపాదించే టాస్కులలో యష్మీ ఆట తీరు చూసి షాకవుతున్నారు. దీంతో ఆమె టాప్ 5 పక్కా అంటున్నారు.