రైతుబిడ్డ ముసుగులో పల్లవి  ప్రశాంత్ నయా బిసినెస్

Phani.ch

23 May 2024

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒక రైతుబిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ లోకి వెళ్లి.. ఒక సామాన్యుడు టైటిల్ కొట్టడం తో  తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

అయితే పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి వచ్చే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచేస్తానని పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడు.

బిగ్ బాస్ షో ముగిసి ఐదు నెలలు అవుతున్నా పల్లవి ప్రశాంత్ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. మధ్యలో ఒక లక్ష రూపాయలు ఇచ్చి పెద్ద ఆర్భాటం చేశాడు.

ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో నెరవేర్చని పల్లవి ప్రశాంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  శివాజీని అయితే నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని బాగానే వాడుకుంటున్నాడు. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళుతూ డబ్బు మంచిగానే వెనకేస్తున్నాడట.

రూ. 2 నుండి 5 లక్షల వరకు ఒక ఈవెంట్ కి కలెక్ట్ చేస్తున్నాడట. నెలకు పల్లవి ప్రశాంత్ సంపాదన రూ. 20 లక్షల పైనే అంటున్నారు.

అంతే కాక సోషల్ మీడియా ద్వారా అతనికి మరికొంత డబ్బులు లభిస్తుంది. దీన్ని బట్టి పల్లవి ప్రశాంత్ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడనే చెప్పాలి.