19 December 2023

 పోలీసుల తీరుపై పల్లవి ప్రశాంత్ సీరియస్

బిగ్ బాస్ సీజన్ 7 ఎట్టకేలకు పూర్తయ్యింది. అందరు అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పుడు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.

అంతకు ముందు ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, రీల్స్ తో తెగ పాపులర్ అయ్యిండు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనే లక్ష్యంతో వీడియోలు తీసి చివరకు విన్నర్గా కూడా నిలిచి హిస్టరీ కెక్కాడు.

ఈక్రమంలోనే అక్కడున్న రన్నరప్ అమర్ దీప్ ఫ్యాన్స్ తో గొడవకు దిగారు. ఇరువురి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా మారి కొట్టుకునే వరకు వచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... పల్లవి ప్రశాంత్ను కారు నుంచి బయటకు బయటికి దిగనివ్వకుండా అడ్డుకున్నారు.

అయితే పోలీసులు తన ఫ్యాన్స్‌కు అభివాదం చేయకుండా .. కారు నుంచి బయటికి దిగకుండా అడ్డుకోవడంతో... పల్లవి ప్రశాంత్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

పోలీసులు ఒక రైతు బిడ్డకు గింత విలువ ఇస్తలేరు అంటూ కామెంట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బయటికి వచ్చి వైరల్ అవుతోంది.