మేకప్ స్కూల్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ శోభాశెట్టి.. పేరేంటంటే..
TV9 Telugu
Pic credit - Instagram
కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కన్నడ భామ శోభా శెట్టి. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన విలనిజంతో భయపెట్టింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. హౌస్‌లో తన ఆట తీరు.. ప్రవర్తనతో నెగిటివిటీని మూటగట్టుకుంది. అలాగే తన మేకప్ పై ట్రోలింగ్ కూడా జరిగింది.
ఇదిలా ఉంటే.. సీరియల్స్ కాకుండా ఇటీవలే యాంకర్‌గా మారింది. కాఫీ విత్ శోభా అంటూ బుల్లితెర తారలను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటుంది శోభా.
అలాగే ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్ చేసింది శోభా శెట్టి. ఇప్పుడు ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించేందుకు రెడీ అయ్యింది. సొంతంగా స్కూల్ కూడా ఒపెన్ చేసింది శోభా.
బిగ్‌బాస్ కు వెళ్లడానికి ముందే తాను SY మేకప్ స్టూడియోను స్టార్ట్ చేయడం జరిగిందని.. కానీ హౌస్‌లోకి వెళ్లడం వల్ల ఇన్స్టిట్యూట్ను లాంఛ్ చేయలేదని చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు మళ్లీ ఫ్యాన్స్ ముందుకు వచ్చానని.. కొత్తగా మేకప్ స్టూడియోను స్టార్ట్ చేస్తున్నానని.. ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో మొత్తం 28 రోజులు ట్రైనింగ్ ఉంటుందని తెలిపింది.
ట్రైనింగ్‌లో కంప్లీట్ ప్రొఫెషనల్ మేకప్ నేర్పిస్తామని.. సర్టిఫికేట్ కూడా అందజేస్తా. ఎలాంటి మేకప్ డౌట్స్ అయినా ఉండొచ్చు.. పదిరోజుల్లోనే అన్ని మేకప్స్ నేర్పిస్తామంటుంది.
మేకప్, హెయిర్ స్టైల్స్, ఫ్లవర్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయిస్తామంటుంది. ట్రైనింగ్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్‌లో బిజినెస్ డెవలప్ చేసుకోవడం నేర్పిస్తారట.