03 January 2024

ప్రేమలేదు ఏం లేదు.. అంతా హంబక్‌ 

TV9 Telugu

శోభా శెట్టి..! కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌ బాస్ తో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది.

ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే బిగ్‌ బాస్‌ షోలోనే తన ప్రేమ, ప్రియుడి గురించి పంచుకుని అందరికీ షాక్‌ ఇచ్చింది శోభ.

కార్తీక దీపం సీరియల్‌లో తనతో పాటు యాక్ట్ చేసిన యశ్వంత్‌తో ప్రేమాయణం నడిపించిన ఈ బ్యూటీ.

తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసింది.

కొత్త సంవత్సరం సందర్భంగా ఓ టీవీ షో స్టేజ్‌పై శోభకు, యశ్వంత్‌కు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది.

ఇద్దరూ పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్‌ ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

అయితే ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ, యశ్వంత్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలియడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.