03 February 2024

మొత్తానికి హీరో అయిపోయిన బిగ్‏బాస్ అమర్ దీప్

TV9 Telugu

‘జానకీ కలగనలేదు’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్.

ఇందులో రామ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అదే క్రేజ్‏తో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు.

ఇక బిగ్‏బాస్ షోలో ఉండగానే తన అభిమాన హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న అమర్.. ఇప్పుడు హీరోగాను మారాడు.

ఇప్పటికే ఒకసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

M3 మీడియా బ్యానర్ లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమాలో అమర్ దీప్ సరసన సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీతను ఎంపిక చేశారు.