04 September 2023
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాదు., నాని కూతురు.. ఇదేం ట్విస్టు.!
నాని, మృణాల్ ఠాకూర్, చైల్డ్ ఆర్టిస్ట్ కేయారా ఖన్నాప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఖరారు చేసారు.
ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేసారు ఈ మూవీ మేకర్స్..
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నాని..హాయ్ నాన్న ద్వారా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
ఈ సినిమాలో ఎనిమిదేళ్ల పాపకు తండ్రిగా నాని నటించారు. అయితే.. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఉంది అంటున్నారు మేకర్స్.
ఆ ఎనిమిదేళ్ల పాప భవిష్యత్తులో 25 ఏళ్ల అమ్మాయి అయిపోతే ఎలా ఉంటుందో ఆ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారట.
భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన మృణాల్ ఠాకూర్.. నానీని 'హాయ్ నాన్న'అని పలకరిస్తుంది.
ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశమని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి