కుర్రహీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న భూమిక.. ఎంత ముద్దుగా ఉందో..

15 September 2025

Rajeev  

 తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ.

వయసు పెరిగినా తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామల్లో భూమిక చావ్లా ఒకరు. తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్  లెవల్లో ఉండేది.

సుమంత్ హీరోగా నటించిన యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. 

 ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది ఈ భామ.

తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. 

పవన్ కళ్యాణ్ తో ఖుషీ, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. అలాగే సీనియర్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.