TV9 Telugu
13 February 2024
వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తున్న భూమిక
భూమిక చావ్లా .. ఒకప్పుడు ఈ చిన్నదానికి ఉన్న క్రేజే వేరు.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ అమ్మడు.స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించింది భూమిక.
భూమికకు యువకుడు మొదటి సినిమా. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది ఈ అందాల సుందరి.
తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది భూమిక చావ్లా.
భూమిక చావ్లాకు మిస్సమ్మ (2003 )చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో శివాజీ హీరో గా నటించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఒక్కడు సినిమాలో నటించింది భూమిక. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా అప్పట్లో సెక్సేషన్ అనే చెప్పాలి. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.
ఇక ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలో నటించింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతోనూ నటించింది భూమిక.
ఇక్కడ క్లిక్ చెయ్యండి