ఈమెను చూసిన చంద్రుడు నేలపైకి దిగిరాడా నా వెన్నెల నీవని..

10 December 2023

21 ఆగస్టు 1978న దేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది భూమికా చావ్లా. ఈమె అసలు పేరు రచనా చావ్లా.

ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఈ ముద్దుగుమ్మకి ఒక అన్నయ్య మరియు సోదరి కూడా ఉన్నారు. ఢిల్లీలోనే పాఠశాల విద్య పూర్తిచేసింది.

1997లో ముంబైకి వెళ్లి యాడ్ ఫిల్మ్‌లు మరియు హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించింది.

Zee TV సిరీస్ హిప్ హిప్ హుర్రే మరియు స్టార్ బెస్ట్ సెల్లర్స్ - ఫుర్సాట్ మెయిన్‌ ద్వారా బుల్లితెరలో కనిపించింది.

2000లో సుమంత్ కి జోడిగా యువకుడు అనే తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

2001లో పవన్ కళ్యాణ్ సరసన రొమాంటిక్ కామెడీ చిత్రం ఖుషీలో కథానాయకిగా నటించి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తర్వాత స్నేహమంటే ఇదేరా, ఒక్కడు, సింహాద్రి, నా ఆటోగ్రాఫ్ వంటి ఎన్నో తెలుగు హిట్ చిత్రాల్లో నటించింది ఈ భామ.

2017లో ఏంసిఏ చిత్రంలో నానికి వదిన పాత్రలో, 2021లో పాగల్ లో తల్లి పాత్రలో, 2022లో బటర్ ఫ్లై సినిమాలో అనుపమకి అక్కగా నటించి ఆకట్టుకుంది.