భూతద్దం భాస్కర్ నారాయణ ట్రైలర్.. చౌర్య పాఠం టీజర్ రిలీజ్..
TV9 Telugu
12 February 2024
శివ కందుకూరి హీరోగా పురుషోత్తం తెరకెక్కిస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'భూతద్దం భాస్కర్ నారాయణ'.
ఇందులో హీరో ఓ డిటెక్టివ్ గా కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
చాలా హత్యలు జరుగుతున్న సమయంలో.. హంతకుడు ఎవరో కనిపెట్టడానికి వస్తారు హీరో. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.
రాశి సింగ్ ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. ఈ చిత్రం మార్చ్ 1న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంద్రా రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో తెరకెక్కిస్తున్న క్రైమ్ కామెడీ-డ్రామా సినిమా చౌర్య పాఠం.
ఈ సినిమాను నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్నారు. నక్కిన నరేటివ్స్ పతాకంపై త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి చందూ మొండేటి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
దావ్జాండ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి