భోళా శంకర్! అనౌన్స్‌కు ముందే.. చిరంజీవి మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చింది ఈ సినిమా. మహతి స్వర సాగర సంగీతం అందించారు.
ఇక మధ్యలో రిలీజ్ అయిన చిరంజీవి ఫోటోలు.. భోళా శంకర్ సినిమాపై అందర్లో విపరీతంగా అంచనాలను కూడా పెంచాయి.
కానీ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా... బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది.
ఫస్ట్ షో నుంచే.. నెగెటివ్ టాక్తో.. నెట్టింట తెగ వైరల్ కూడా అయింది భోళా శంకర్ మూవీ. దీంతో బాక్స్ ఆఫీస్ కి నష్టాన్ని మిగిల్చింది.
అసలు చిరు చేయాల్సిన సినిమానే కాదనే కామెంట్‌ను మెగా ఫ్యాన్స్ నుంచే వచ్చేలా చేసుకుంది. కానీ కట్ చేస్తే.. సర్‌ప్రైజింగ్‌లీ ఓటీటీలో దుమ్ముదులుపుతోంది చిరంజీవి భోళా శంకర్ మూవీ.
వినాయచవితి సందర్భంగా.. సెప్టెంబర్ 15 నెట్ ఫ్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ.. మ్యూజ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది.
ఈ చిత్రానికి మెహర్ రామేష్ దర్శకత్వం వహించగా.. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, కె. ఎస్. రామారావు సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీలో చిరుకి జోడిగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో కనిపించింది. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు.