సస్పెన్స్ థ్రిల్లర్‌ భవనమ్‌ ట్రైలర్..

TV9 Telugu

18 April 2024

సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహా ఉల్లాల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా భవనమ్‌.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి గతంలో ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇవి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ది హాంటెడ్ హౌస్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందించిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసారు దర్శకనిర్మాతలు.

ఈ టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ తో పాటు హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. దీని కోసం ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్.

తమ బ్యానర్‌లో ఇది 95వ సినిమా అని, తప్పకుండా టార్గెట్‌ ఆడియన్స్ ని మెప్పిస్తుందని అన్నారు ఆర్‌.బి.చౌదరి.

సమ్మర్ స్పెషల్ గా మే లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.