అబ్బ.. క్యూట్ అందాలతో మతిపోగొడుతున్న భావన.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్

Phani CH

08 SEp 2024

భావన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. గోపి చంద్ హీరోగా నటించి ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కార్తికా మీనన్. ఈ చిన్నది కేరళలోని త్రిస్సూర్ పుట్టింది.  2002 లో మలయాళంలోని నమ్మళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.

శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ భావన. ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమైంది

మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ హీరో ఆమెను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది.

2018లో నిర్మాత నవీన్ ను వివాహం చేసుకుంది. కానీ గతంలో ఆమె అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారని తెలిపింది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో నడికార్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. నెట్టింట భావన చాలా యాక్టివ్.