బ్లాక్ డ్రెస్ లో తన అందంతో ఆకట్టుకుంటున్న భాను శ్రీ..

10 December 2023

14 సెప్టెంబర్ 1988న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ముద్దుగుమ్మ భానుశ్రీ.

హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది తరువాత గ్రాడ్యుయేట్ డిగ్రీని పట్టా పొందింది.

ఈ వయ్యారి భామని భాను శ్రీ రెడ్డి, భాను త్రిపాఠి, భాను త్రిపాఠి, స్వప్న అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.

2017లో వచ్చిన ఇద్దరి మధ్య 18 అనే ఓ తెలుగు రొమాంటిక్ కామెడీయ సినిమాలో ఓ చిన్న పాత్రతో చలనచిత్ర రంగప్రవేశం చేసింది.

తర్వాత జాబిలమ్మ అనే ఓ తెలుగు డైలీ సీరియల్ లో ఓ పాత్రతో బుల్లితెరపై కూడా సందడి చేసింది ఈ వయ్యారి భామ.

ఈమెకు ఇష్టమైన హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇష్టమైన నటి అమల అక్కినేని. ఇష్టమైన సినిమా అత్తారింటికి దారేది.

‘గోల్డ్ రష్’ మరియు ‘టాలీవుడ్ స్క్వేర్స్’ అనే రెండు తెలుగు గేమ్ షోలకు యాంకర్ గా కూడా మెప్పించింది ఈ బ్యూటీ.

2018లో ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 2’ కంటెస్టెంట్‌ గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ భామ.