అదేంటో..! రీసెంట్ డేస్లో ప్రభాస్ అనుకున్నది ఒక్కటీ జరగ్లేదు. తను అప్‌టూ ది మార్క్ కష్టపడుతున్నా కూడా... తన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని అలా జరిగిపోతూనే ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఓ సినిమాలో.. ప్రభాస్ స్వీటీ అనుకుంటే.. తన పక్కన నయన్ వచ్చి చేరింది.
అయితే ఈ మ్యాటర్లో ప్రభాస్ సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. ఆయన ఫ్యాన్సే మాత్రం పాపం అంటూ.. తాజాగా నెట్టింట రియాక్టవుతున్న పరిస్థితి.
ఇక అసలు విషయం ఏంటంటే.. మంచు విష్ణు హీరోగా.. మహాభారత్ డైరెక్టర్ ముఖేష్ ఖన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్నప్ప.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ శివుని గా నటిస్తున్నారనే అన్ అఫీషియల్ అఫీషియల్ లీక్ బయటికి వచ్చింది.
అదొక్కటే కాదు.. తనకు పార్వతిగా.. స్వీటీని నటింపజేయడానికి స్వీటీని రంగంలోకి దించుతున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది.
డార్లింగ్ అండ్ స్వీట్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ అయ్యేలా చేసింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా.. పార్వతిగా నయనతార నటిస్తున్నారట.
ఈ విషయం కూడా అన్‌అఫీషియల్‌గా బయటికి రావడం.. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.