భజే వాయు వేగం టీజర్..
TV9 Telugu
21 April 2024
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా భజే వాయు వేగం.
బెదురులంక సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో కార్తికేయ.. తర్వాతి కొత్త సినిమా కోసం కాస్త టైమ్ తీసుకున్నారు.
మంచి కథతో తాజాగా భజే వాయు వేగంతో వస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
రధన్ ఈ సినిమాకి స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ మూవీ టాలీవుడ్ హీరో కార్తికేయ 8వ సినిమాగా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను యూట్యూబ్ వేదికగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్ లో విడుదల చేసారు.
డ్రగ్స్ కేసులో కార్తికేయను ప్రధాన నిందితుడిగా చూపించారు. దీంతో ఓ కేసు చుట్టూ తెరిగే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తునట్టు తెలుస్తోంది.
గతవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి