18 July 2025
సినిమా డిజాస్టర్ అయినా తగ్గని ఆఫర్స్.. అమ్మడి జోరు ఆగట్లేదుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ ఈ అమ్మడి అందానికి తెలుగు అడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకాలో నటిస్తుంది.
మరోవైపు అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రంలోనూ ఈ బ్యూటీని తీసుకున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు టాక్.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు .. తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా వస్తుందట.
అయితే ఈ సినిమాలో నాని సరసన ది ప్యారడైజ్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేసినట్లు టాక్. త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్