13 July 2025
చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. అయినా క్యూ కట్టిన ఆఫర్స్.. ఆగేలా లేదుగా
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో చేసిందే ఒక్క సినిమా. అది కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.
అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
ఇక ఈ ఏడాదిలోనే ఆమె నటిస్తోన్న సినిమాలు వరుసగా విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.
ఈ అమ్మడు మరెవరో కాదండి.. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య
ఇప్పుడు విజయ్ దేవరకొండతో భాగ్య శ్రీ బోర్సే చేస్తోన్న కింగ్ డమ్ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. భారీ అంచనాలు ఉన్నాయి.
రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రా కింగ్ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండింటితోపాటు కాంతా అనే పీరియాడికల్ కథలో నటిస్తుంది బాగ్య శ్రీ.
కాంతా చిత్రంలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలపై క్లారిటీ రానుంది.
భాగ్య శ్రీ బోర్సే ఈ ఏడాది మూడు సినిమాలతో సత్తా చాటాలని చూస్తుంది. అలాగే మరిన్ని ఆఫర్స్ ఈ బ్యూటీకి క్యూ కట్టినట్లు టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్