బ్లాక్ డ్రెస్ లో భాగ్యశ్రీ బోర్సే స్టన్నింగ్ లుక్స్

Phani CH

09 AUG 2024

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ చిత్రంగా వస్తోంది 'మిస్టర్ బచ్చన్'.

తెలుగు ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది ఈ సినిమా. ఈ చిత్రంలో పూణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

ఇప్పుడు ఈ విషయం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్, ప్రొఫెషనలిజంను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే, అయితే, ఇదివరకే విడుదలైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్, టీజర్‌లో తన బ్యూటీఫుల్ అండ్ బోల్డ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది భాగ్యశ్రీ.

ఇక భాగ్యశ్రీ బోర్సే మొదట్లో మోడల్‌గా రాణించింది. తర్వాత 2023లో వచ్చిన హిందీ మూవీ యారియన్ 2తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి డెబ్యూ ఇస్తోంది. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ వీడీ12 చిత్రంలో కూడా హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే చేస్తోంది.