కొత్త నేషనల్ క్రష్.. అమ్మడి అందానికి మెంటలెక్కిపోతున్న కుర్రకారు

03 December 2025

Pic credit - Instagram

Rajeev 

భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్. గతేడాది మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు.

తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు.

అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది.

మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ అమ్మడు నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైంది. జూలై 31న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. 

తన అందంతో కవ్విస్తున్న భాగ్య శ్రీ కొత్త నేషనల్ క్రష్ అదిరిపోయిందంటూ అమ్మడి ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్

తాజాగా రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో హిట్ అందుకుంది ఈ అందాల భామ.