బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నయా మూవీ.. ఇండియన్ 2 అప్‌డేట్..

TV9 Telugu

06 January 2024

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్‌ డే సందర్భంగా ఆయన నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

అయన హీరోగా టైసన్‌ నాయుడు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతమందిస్తున్నారు.

కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.

సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్దన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది బుల్‌ సినిమాలో హీరోయిన్‌గా సమంత పేరును ఫైనల్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూజర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2025 ఈద్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియన్ 2 సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

కమల్‌ హాసన్‌ చిత్రయూనిట్‌తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.