పవన్‌పై  బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్..

తెలుగు ప్రేక్షలకు పరిచయం అవసరం లేని పేరు బండ్ల గణేష్‌.

నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు.

గబ్బర్ సింగ్‌, ఇద్దరమ్మాయిలతో, టెంపర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు.

అయితే బండ్ల గణేష్‌ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చే పేరు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.

పవన్‌ తీన్‌మార్, గబ్బర్ సింగ్‌ వంటి చిత్రాలను నిర్మించిన అయన వీరాభిమానిగా చెప్పుకుంటారు.

కొన్ని ఈవెంట్స్ లో పవన్‌ గురించి బండ్ల ఇచ్చిన స్పీచ్‌లు ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ సృష్టించాయి.

తరచూ సోషల్‌ మీడియాలోనూ  పవన్‌ గురించి మాట్లాడుతూ ఉంటారు అయన.

ఈక్రమంలో తాజాగా పవన్‌పై మరోసారి ఆసక్తికర ట్వీట్‌ చేశారాయన .

సోమవారం గురు పౌర్ణమి పురస్కరించుకొని తన గురువు పవన్‌ కల్యాణ్‌కు విషెస్‌ చెప్పారు.

అలాగే ఇకపై ఆయన పేరును వాడకోనంటూ సంచలన ట్వీట్ చేశారు బండ్ల గణేష్‌.