మరే హీరోకి సాధ్యం కాని బాలయ్య రేర్ రికార్డ్స్ ఇవే..
Battula Prudvi
21 October 2024
పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు చేసిన ఏకైక స్టార్ హీరో బాలయ్య.
1987లో బాలయ్య హీరోగా 8 సినిమాలు విడుదల అయ్యాయి. మొత్తం 8 మూవీస్ కూడా మంచి విజయం సాధించడం ఓ రికార్డు.
నరసింహనాయుడు, సింహా, లెజెండ్ సినిమాలకు మూడు ‘నంది’; లెజెండ్కి సైమా; ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
అత్యధికంగా కోదండ రామిరెడ్డితో 13 చిత్రాల్లో నటించారు. 17చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసెను. ‘అధినాయకుడు’లో ట్రిపుల్ రోల్ చేసారు.
ఎన్టీఆర్: కథానాయకుడులో అత్యధిక గెటప్పుల్లో నటించారు. చంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య అయన డ్రీమ్ రోల్స్.
50 ఏళ్ల సినిమా ప్రయాణంలో ఎప్పుడు చెయ్యని ఎక్కువగా కసరత్తులు 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం చేశారు.
50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతో ఉత్సాహంగా చేసిన సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’.
బాలయ్య హీరోగా చేసిన 71 సినిమాలు 100 రోజులకుపైగా సందడి చేశాయి. ‘లెజెండ్’ కొన్ని కేంద్రాల్లో 1000కి రోజులకకుపైగా ఆడటం ఓ రికార్డు.
సినీ ప్రస్థానం మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకూ ఒక్క రీమేక్ చిత్రం కూడా చెయ్యలేదు నటసింహ బాలకృష్ణ.
ఓ రాత్రి తాను నటించిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ.. తెల్లారేసరికి ఆదిత్య 999కి కథ సిద్ధం చేసేశారు బాలయ్య.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. తండ్రి పాత్రను తనయుడు పోషించడం నిర్మించడం ఇండియన్ ఇండస్ట్రీలోనే తొలిసారి.