టాలీవుడ్‌లో మరే హీరో చేయని సాహసం అఖండ సినిమా కోసం చేశారు బాలయ్య. ఆ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించారు.
తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా బాలయ్య చేసిన ఈ ప్రయోగం బాగా వర్క్ అవుట్ అయ్యింది, వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అఖండ.
అఖండ తరువాత చేసిన వీర సింహారెడ్డిలోనూ కొత్త లుక్ ట్రై చేశారు బాలయ్య. ఫ్యాక్షనిస్ట్ అంటే వైట్ అండ్ వైట్‌లో కనిపిస్తారు. బాలయ్య కూడా ఆ గెటప్‌తో చాలా సినిమాలు చేశారు.
కానీ వీర సింహారెడ్డి కోసం బ్లాక్ షర్ట్, బ్రౌన్ లుంగీతో కొత్త లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో బాలయ్య స్టైలింగ్, మేనరిజమ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
రీసెంట్‌గా భగవంతం కేసరి కోసం మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు నందమూరి నటిసింహం. అచ్చమైన తెలంగాణ పల్లెల నుంచి వ్యక్తిగా కొత్త లుక్ లో కనిపించారు.
లుక్ విషయంలోనే కాదు డైలాగ్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌లోనూ చాలా వేరియేషన్ చూపించారు. అందుకే భగవంత్ కేసరి బాలయ్య అభిమానులకు ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయ్యింది.
నెక్ట్స్ చేయబోయే సినిమా విషయంలోనూ అదే ప్లాన్‌లో ఉన్నారట బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలోనూ కొత్త స్టైల్ లో కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో లుక్ టెస్ట్ కూడా చేశారు. త్వరలో ఒక లుక్ ఫైనల్ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది యూనిట్.