వరస విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరితో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి దసరాకు వచ్చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి సెంటిమెంట్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్.
ఉయ్యాలో ఉయ్యాలా అంటూ సాగే ఈ పాటలో తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ చూపించారు. ఓ వైపు మాస్.. మరోవైపు ఎమోషన్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
గతంలో ఈ జోనర్‌లో వచ్చిన ముద్దుల మావయ్య, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహా, నరసింహనాయుడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ కాసుల పంట పండించాయి.
అనిల్ రావిపూడి ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. భగవంత్ కేసరిలో బాలయ్య ఇమేజ్‌కు తగ్గ అంశాలన్నీ ఉన్నాయి. దాంతో పాటు సెంటిమెంట్ కూడా బలంగా ఉండబోతుంది.
ముఖ్యంగా బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టించేలా తెరకెక్కిస్తున్నారు అనిల్. దసరాకు ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్‌కు ట్రీట్ ఖాయం అంటున్నారు భగవంత్ కేసరి మేకర్స్.