21 September 2023

NBK అన్‌స్టాపబుల్ షోకు KTR..?

సినిమాల్లోనే కాదు.. ఓటీటీలో కూడా తన ఎంట్రీతో  వైబ్రేషన్స్ క్రియేట్‌ చేసిన స్టార్ నందమూరి బాలయ్య. 

ఓ పక్క తన సినిమాలతో కలెక్షన్లు కుమ్మేస్తున్న బాలయ్య.. ఇంకో పక్క అన్‌స్టాపబుల్ షో చేస్తూ.. స్ట్రీమింగ్ మినెట్స్‌లో సెన్సేషనల్ అయ్యారు.

ఓటీటీ ఫీల్డ్ లోనే.. తన క్రేజ్‌తో.... హోస్టింగ్ స్టైల్‌తో.. అన్‌ స్టాపబుల్ షోతో.. అన్‌ స్టాపబుల్‌.. రికార్డులు క్రియేట్‌ చేశారు.

ఇక ఇప్పుడు మరో సీజన్‌తో.. మన ముందుకు రాబోతున్నారు మన అన్‌స్టాపబుల్ బాలయ్య.

ఎస్ ! తొందర్లో మరో సీజన్‌ మొదలెట్టనున్న బాలయ్య.. ఈ సారి తెలంగాణ యంగ్ మినిస్టర్ KTRను ఇంటర్వ్యూ చేయనున్నారట.

KTR ఇంటర్వ్యూతోనే తన అన్‌స్టాపబుల్ గేమ్ షోను.. అన్‌ స్టాపబుల్‌గా బిగిన్  చేయనున్నారట.

ఇక KTRతో బిగిన్ అయ్యే బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 3 మెగాస్టార్ చిరు ఫైనల్ ఎపిసోడ్‌తో ముగియనుందట

అయితే అఫీషియల్ గా ఈ న్యూస్ బయటికి రానప్పటికీ.. అన్‌ అఫీషియల్‌గా.. ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఈ షో వైపే అందర్నీ చూసేలా చేస్తోంది.