TV9 Telugu
మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్.. ఓం భీమ్ భుష్ అంటూ వస్తున్న శ్రీవిష్ణు..
23 Febraury 2024
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా తెగ వైరల్ అవుతుంది.
ఓ వేడుకకు తండ్రి బాలయ్యతో పాటు హాజరైన మోక్షును చూసి అభిమానులే కాదు.. అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు.
కొంచెం గడ్డంతో, స్టైలిష్ మేకోవర్‌తో ఉన్న బాలయ్య తనయుడి లుక్ సోషల్ మీడియా ద్వారా ట్రెండ్ అవుతుందిప్పుడు.
మోక్షజ్ఞ త్వరలో తన వారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే బాలయ్య పలు సందర్బాల్లో తెలిపారు.
హుషారు, రౌడీ బాయ్స్ లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన హర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా OBB.
దీనికి ఓం భీమ్ భుష్ అనే టైటిల్ ఖరారు చేసారు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తుంది ఈ చిత్రం.
యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఈ నెల 26న విడుదల చేయనున్నారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి