బాలయ్య ప్యాన్‌ ఇండియా ఎంట్రీ?

TV9 Telugu

12 March 2024

దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు హీరోలు కూడా ప్యాన్‌ ఇండియా ఎంట్రీ కోసం చాల ప్లాన్‌ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటె మరి మా బాలయ్య ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్టు అని ఆయన అభిమానులు ఇదివరకు చాలా సార్లు అనుకున్నారు.

ఇప్పటిదాకా అలా ఫీలయిన వారికి గుడ్‌న్యూస్‌ చెప్పేశారు బాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్‌ గర్ల్ ఊర్వశి రౌతేలా.

తాను యాక్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా అంటూ బాలయ్య ఎన్‌బీకే 109 మూవీ గురించి చెప్పేశారు.

ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా గ్లింప్స్ వీడియో యూట్యూబ్‌ వేదికగా నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతుంది.

ఈ విషయాన్ని కూడా తాను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మెన్షన్‌ చేశారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాతో నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైయ్యారు బాలయ్య.

ఇప్పుడు ఎన్‌బీకే 109 బాలయ్య ప్యాన్‌ ఇండియా మార్కెట్‌ ఆల్రెడీ ఓపెన్‌ అయిందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.