09 November 2023
దిమ్మతిరిగే యాక్షన్ కాన్సెప్ట్‌తో.. బాలయ్య, బాబీ నయా సినిమా..
భగవంత్ కేసరి సినిమాతో.. థియేటర్లను భగ్గుమనేలా చేసిన నందమూరి బాలయ్య.. తాజాగా మరో సినిమా మొదలెట్టారు.
అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. తన 109వ సినిమాను షురూ చేశారు.. ఆ అప్డేట్‌తోనే ట్రెండ్ అవుతున్నారు.
బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్లో.. ఎన్‌బీకే 109 వర్కింగ్ టైటిల్‌తో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ అయింది.
శ్రీకర ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్4 సినిమాస్ కాంబోలో ఈ సినిమా ప్రొడ్యూస్ అవుతోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ పైనే తాజాగా క్రేజీ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది.
బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్... వయోలెన్స్‌కా విజిటింగ్ కార్డ్.. నటసింహం నందమూరి బాలయ్య, డైరెక్టర్ బాబీ.
ఎబీకె109 షూట్ బిగిన్స్ ఫ్రమ్ టుడే అంటే నవంబర్ 8th డే అంటూ.. తాజాగా మేకర్స్ నుంచి ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది.
దాంతో పాటే.. సినిమా థీమ్ అండ్ జానర్‌ను రివీల్ చేస్తూ.. ఓ కాన్సెప్ట్ పోస్ట్ కూడా రిలీజ్ అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి