బాలయ్యకి జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ.. ఓటిటిలోకి సైంధవ్..

TV9 Telugu

01 February  2024

బాలయ్య, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమా NBK 109లో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది.

ఈ యక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్యకి జోడిగా బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌటెలా హీరోయిన్‌గా నటించబోతున్నారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. గత ఏడాది సంక్రాంతికి చిరు వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ పాటలో ఆడిపాడింది.

బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నానని.. దానికోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిపింది ఊర్వశి.

విక్టరీ వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా సైంధవ్.

ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన సైంధవ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

దాంతో అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటికి వచ్చేస్తుంది ఈ చిత్రం. ప్రముఖ డిజిటల్ ప్లేట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కానుంది.

ఫిబ్రవరి 3 నుంచి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది సైంధవ్.