హరీష్ శంకర్, బాలయ్య సినిమా.. 100 కోట్ల వైపుగా టిల్లు..

TV9 Telugu

03 April 2024

నందమూరి నటసింహ బాలకృష్ణ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా కాలంగా టాక్ నడుస్తుంది.

తాజాగా హరీష్ శంకర్ పుట్టిరోజు సందర్భంగా వీరిద్దిరి కాంబోలో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది.

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ హరీష్ శంకర్‌కు బర్త్ డే విషెష్ చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది.

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సినిమా టిల్లు స్క్వేర్.

మార్చ్ 29న విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

పెద్ద సినిమాలకు ధీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ 65 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.

నాలుగో రోజు కూడా అద్బుతాలు చేసింది. ఇప్పటికే 78 కోట్లు వసూలు చేసి.. 100 కోట్ల వైపు అడుగులు వేస్తున్నాడు టిల్లు.