బలగం బ్యూటీ మతిపోగొట్టిందిగా.. బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతుంది

Rajeev 

24 May 2024

 టాలీవుడ్ లో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన చిన్నది కావ్య కళ్యాణ్  రామ్. 

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ముఖ్యంగా గంగోత్రి సినిమా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసుద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆతర్వాత బలగం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బలగం తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు.

మొన్నామధ్య శ్రీసింహ తో కలిసి ఉస్తాద్ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా బోల్తా కొట్టింది.

ఇప్పుడు బడా సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది.