TV9 Telugu

08 February 2024

గ్రేట్‌ వేణు.! కామెడీ , డైరెక్షనే కాదు , మరో సూపర్ టాలెంట్.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు.

పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు.

బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా గురించి కాస్తా పక్కకు పెడితే.. వేణు కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు తనకీ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అని..

అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ షిప్ గెలిచానని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు వేణు.

అయితే వేణు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఛాంపియన్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గ్రేట్! వేణులో కూడా.. ఈ ట్యాలెంట్‌ కూడా ఉందనే మాట నెట్టింట కనిపిస్తోంది.