22 September 2023

వావ్ .. ఆస్కార్‌ రేసులో బలగం, దసరా

Pic credit - Instagram

ట్రిపుల్‌ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందనే న్యూస్ ఇంకా కనుమరుగవ్వనేలేదు.. అప్పుడే 2024 ఆస్కార్  కోసం ఇండియన్ సినిమాల ఎంపిక మొదలైపోయింది.

ఫిల్మ్ మేకర్స్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని కమిటీ.. ఉత్తమ విదేశీ క్యాటగిరీ కింద.. ఫిల్మ్ మేకర్స్ నుంచి దరఖాస్తులను తీసుకోవడం స్టార్ట్ చేసింది.

దీంతో తెలుగు టూ స్టేట్స్‌ నుంచి.. సూపర్ డూపర్ హిట్టైన బలగం మూవీ.. దసరా మూవీ.. ఆస్కార్ ఎంట్రీ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి. 

ఇక తెలుగు సినిమాలతో.. మలయాళంలో ప్రేక్షకాధరణ పొందిన కేరళ స్టోరీ సినిమా కూడా ఆస్కార్ కోసం బరిలో దిగుతోంది. 

బాలీవుడ్ నుంచి గదర్‌ 2, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్‌ కహాని మేకర్స్ కూడా..  ఇండియన్ ఆస్కార్ కమిటికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

ఇక కోలీవుడ్ నుంచి వెట్రిమారన్  విడుదలై1 సినిమా కూడా ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. 

ఇలా ఇప్పటి వరకు దాదాపు 22 సినిమాలు ఇండియన్ ఆస్కార్ స్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు చేసుకున్నాయి. 

అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న సినిమాలను.. గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని కమిటి చూసి.. ఇండియా తరుపున ఆస్కార్ కోసం ఏ సినిమాను పంపాలనే నిర్ణయం తీసుకుంటుంది.