2023 సర్‌ప్రైజింగ్ బ్లాక్‌బస్టర్స్‌లో బేబీ కూడా ఒకటి. ఈ చిత్రం ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.
యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో నార్త్‌లోనూ బేబీ ఆకట్టుకుంటుందని వాళ్ల నమ్మకం. అయితే రెండేళ్లుగా తెలుగు రీమేక్స్ ఏవీ బాలీవుడ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మన దగ్గర ఇండస్ట్రీ హిట్ అయితే.. హిందీ రీమేక్ షెహ్‌జాదా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
అలాగే మన దగ్గర సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్ఎక్స్ 100 హిందీలో మాత్రం ఏ ప్రభావం చూపించలేకపోయింది.
ఈ రీమేక్ వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తు లేదు. భారీ అంచానల మధ్య విడుదలైన హిట్, జెర్సీ హిందీ రీమేక్స్ కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు.
గద్దలకొండ గణేష్, ఎంసిఏ రీమేక్స్ సైతం అస్సలు ఆకట్టుకోలేదు. పాన్ ఇండియన్ వరకు ఓకే కానీ తెలుగు రీమేక్స్‌పై అక్కడి ఆడియన్స్ ఆసక్తిగా లేరు.
ఇలాంటి టైమ్‌లో బేబీ సినిమా రీమేక్ అనేది రిస్క్‌తో వ్యవహారమే. కానీ సాయి రాజేష్ ఈ రిస్క్ తీసుకుంటున్నారు.
ఓ ఫేమస్ యూ ట్యూబర్ బేబీ రీమేక్‌తో హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బేబీ అయినా రీమేక్స్ బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ చెప్తుందో లేదో..?