హిందీలోకి సిద్ధమైన అరణ్మణై 4.. ఎప్పుడంటే.?

Anil Kumar

21 May 2024

హీరోయిన్స్ రాశీ ఖన్నా , తమన్నా ప్రధాన పాత్రల్లో మెప్పించిన సుందర్ సి తెరకెక్కించిన సినిమా అరణ్మణై 4.

తమిళ్ లో హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరణ్మణై సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది.

ఆ తర్వాత ఈ సినిమా సిరీస్ లుగా చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా మంచి విజయాలను అందుకుని సక్సెస్ అయ్యాయి.

ఈ అరణ్మణై 4 సినిమాకు తెలుగులో బాక్ అనే టైటిల్ తో తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో సుందర్ హీరోగా నటించారు. ఈ సినిమాకు తమిళంలో 50 కోట్లకు పైనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు చేసింది.

ఈ మధ్యే ఓటిటిలోకి విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తుంది.

తాజాగా ఈ అరణ్మణై 4 సినిమాను హిందీలోనూ కూడా విడుదల చేయబోతునట్టు డేట్ తో సహా ప్రకటించారు ఈ మూవీ మేకర్స్.

ఈ నెల అదే.. మే 24న అరణ్మణై 4 సినిమా హిందీ వర్షన్ థియేటర్స్ లో విడుదల కానుంది అని అధికారికంగా ప్రకటించారు.