అయలాన్ టీజర్‌తో గతంలో వచ్చిన ఏలియన్ కాన్సెప్ట్ చిత్రాలపై చర్చ..
08 October 2023
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అయలాన్. ఓ గ్రహాంతరవాసి భూమి మీదకు వస్తే అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాల గురించి చర్చించుకుంటున్నారు ఆడియన్స్.
ఏలియన్ కాన్సెప్ట్‌తో వచ్చిన క్లాసిక్ లాంటి సినిమా పీకే. ఏకంగా హీరో క్యారెక్టరే మరో గ్రహం నుంచి వచ్చినట్టుగా చూపించిన ఈ సినిమా వెండితెర మీద కనకవర్షం కురిపించింది.
గ్రహాంతరవాసి పాత్రలో ఆమిర్ ఖాన్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే పీకే ఆమిర్ కెరీర్‌లోనే కాదు బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది.
ఏలియన్ కాన్సెప్ట్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్న మరో బాలీవుడ్ హృతిక్ రోషన్ నటించిన మూవీ కొయి మిల్ గయా మూవీ.
అనుకోకుండా భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్, అమాయకుడైన ఓ కుర్రాడికి హెల్ప్ చేయటం అనే కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించి సక్సెస్ సాధించారు మేకర్స్.
ఏలియన్ క్యారెక్టర్‌కు గుడ్ బై చెప్పినా... అది ఇచ్చిన పవర్స్‌ను మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ క్రిష్ సిరీస్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.