శివకార్తికేయన్ అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని ఫైనాన్షియల్ సమస్యల వల్ల లాస్ట్ మినిట్ లో ఈ మూవీ రిలీజ్ కాన్సిల్ అయ్యింది.
తెలుగు వెర్షన్‌కు సంబంధించి అయలాన్ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులనుషారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ఛీల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ అందించినట్లు తెలిసింది.
గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు వర్క్‌కు సంబంధించి ప్రొడ్యూసర్స్ భారీ మొత్తంలో షారుఖ్ కంపెనీకి ఇవ్వాల్సినట్లు ప్రచారం జరిగింది. అందుకే తెలుగు రిలీజ్‌ను అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి.
ఇక థియేటర్లలో రిలీజైన సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందాన్నిడిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పాటిస్తున్నాయి. దాని కారణంగా అయలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాలేదు.
దాంతో అయలాన్ తమిళ వెర్షన్ మాత్రమే సన్ నెక్స్ట్‌లో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయలేదు. మొదట రెండు భాషల్లో విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ కేవలం తమిళ వెర్షన్‌ను మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకాలానికి తెలుగు వెర్షన్ ఓటిటిలో వస్తోంది.
అయలాన్ తెలుగు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ దక్కించుకుంది. ఏప్రిల్ 19న అయలాన్ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారు మేకర్స్.